పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణ

పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ట్రాఫిక్ క్రమబద్ధీకరణ

భవానిపురం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఉత్తర్వుల ప్రకారం, ట్రాఫిక్ డిసిపి షేక్ షరినా బేగం సూచన మేరకు వన్ ట్రాఫిక్ ఎసిపి రామచంద్ర రావు స్వీయ పర్యవేక్షణలో 10వ తరగతి నిర్వహించే పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టిన వన్ ట్రాఫిక్ సిఐ ఉమామహేశ్వరరావు. సోమవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన దృశ్య వన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పదవ తరగతి పబ్లిక్ పరీక్ష కేంద్రాలు వద్ద విద్యార్థులకు, వాళ్ళను దింపడానికి వచ్చిన తల్లిదండ్రులకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తూ ఎక్కడ కూడా రద్దీ లేకుండా చర్యలు తీసుకోవడం అయినది.

పరీక్షల అనంతరం ఎక్కడా కూడా ట్రాఫిక్ స్తంభించకుండా విద్యార్థులకు తల్లిదండ్రులకు తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కూడా ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ శ్రీధర్, ఎస్ఐ ఓంకార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply