ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తోపాజి

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సంగారెడ్డికి చెందిన తోపాజి అనంత కిషన్ శనివారం హైదరాబాద్‌లోని చంపాపేటలో ఉన్న సామ సరస్వతి గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారాన్ని నిర్వహించారు. అనంతరం తోపాజి అనంత కిషన్ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి రాష్ట్ర ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ఆర్యవైశ్య మహాసభ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సమాజ అభివృద్ధి, ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నూతన రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజి అనంత కిషన్‌కు అభినందనలు తెలియజేస్తూ, సంస్థ అభివృద్ధికి ఆయన సేవలు ఎంతో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మహాసభ రాష్ట్ర, జిల్లా నాయకులు, సభ్యులు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొని నూతన రాష్ట్ర ఉపాధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply