శాకాంబరి అలంకారంలో విద్యాధరి అమ్మవారు.. ప్రత్యేక పూజలు

వర్గల్, ఆంధ్రప్రభ: సమస్త ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వర్గల్ విద్యాధరి క్షేత్రంలో సోమవారం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో శాకాంబరి అలంకారం వైభవంగా నిర్వహించారు. వివిధ రకాల కూరగాయలతో ఆలయ ప్రాంగణంతో పాటు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ఆలయ పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వర్షాలు సమృద్ధిగా కురిసి సస్యశ్యామలం కావాలని ప్రత్యేక హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.