టైర్లు పేలి మంట‌లు

టైర్లు పేలి మంట‌లు

దగ్ధమైన లారీ

చింతూరు, ఆంధ్రప్రభ : పోలవరం జిల్లాలోని చింతూరు మండలం పరిధిలో ప్రమాదవశాత్తు ఒక లారీ టైర్లు పేలి లారీ తగలబడింది. ఈ ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్ట్రం జగదల్పూర్కి చెందిన దిరేంద్ర సింగ్ బాదొరియాకి యజమానికి చెందిన లారీ (సీజీ 18 ఎస్ 8034) రాజమండ్రి నుండి మొక్కలు వేసుకొని వస్తుండుగా మండలంలోని తులసిపాక గ్రామానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో గల చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లారీ రెండు టైర్లు పెలడంతో మంటలు రేగి లారీకి అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో లారీ వెనుక భాగం పూర్తిగా దగ్ధమైంది.

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ రాష్టం కాంకేర్ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ మనోజ్ వర్మ లారీ నుండి బయటకు దూకి సురక్షితంగా బయట పడ్డాడు.ఈ విషయం తెలుసుకున్న ఫైర్ శాఖా అధికారులు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు.