దేశభక్తిని చాటిన ‘తిరంగారంగ్‌’ ర్యాలీ

  • పశ్చిమలో జాతీయ జెండాలతో కదం తొక్కిన టీడీపీ శ్రేణులు
  • ప్రజల్లో జాతీయ సమైక్యత, సామాజిక ఐక్యత పెంపొందించాలి
  • టీడీపీ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ బుద్ధా వెంకన్న

భవానిపురం, ఆంధ్రప్రభ: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్‌లో నిర్వహించిన ‘తిరంగారంగ్‌’ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. అప్నా బజార్‌ రోడ్డు నుంచి స్వాతి థియేటర్‌ రోడ్డు వరకు నిర్వహించిన కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బుద్ధా వెంకన్న పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ సమైక్యత, దేశభక్తి, సామాజిక ఐక్యతను చాటిచెప్పేలా ‘తిరంగారంగ్‌’ ర్యాలీ నిర్వహించడం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావన మరింత పెంపొందించాలని, ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగుతూ దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.nకార్యక్రమంలో 42వ డివిజన్‌ అధ్యక్షుడు పత్తి నాగేశ్వరరావు, క్లస్టర్‌ యేదుపాటి రామయ్య, పి. చిన్నసుబ్బయ్య, బాలు, శివ, సంతోష్‌, ముదిరాజ్‌ శివాజీతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.