నీటి సంపులో పడి మూడేళ్ల చిన్నారి మృతి
శంకర్ పల్లి, ఆంధ్రప్రభ ; రెవెన్యూ మండలంలోని జన్వాడ గ్రా మంలో ఆదివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాట్నే శేఖర్ కూతురు మూడేళ్ల చిన్నారి ప్రియాన్షు ఏడున్నర నుండి ఎనిమిది గంటల మధ్యలో నిద్రలో నుండి మేల్కొని బయటికి నడుచుకుంటూ వచ్చి నీటి సంపు వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ప్రమాద వశా త్తూ సంపులో పడి పోవడంతో తీవ్ర విషాదం నెల కొంది. కుటుంబ సభ్యులు చిన్నారి కనిపించకపోవడంతో పరిసర ప్రాంతాల్లో వెతికారు.
అనంతరం నీటి సంపులో చిన్నారి మృతదేహం కనిపిం చడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు, గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబాన్ని ఓదార్చారు.ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.చిన్నపిల్లలు ఆడు కునే ప్రాంతాల వద్ద భద్రతా చర్యలు తప్పనిసరి గా తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా నీటి సంపులు, బావులు, ట్యాంకుల కు రక్షణ కవర్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు సూచిస్తున్నారు.
