TG HIGH COURT FIRE : ఆ వ్యాఖ్యలు చేయలేదు

TG HIGH COURT FIRE : ఆ వ్యాఖ్యలు చేయలేదు


సంచలనం కోసం.. ఇది తప్పుడు వార్త
కరెక్షన్ న్యూస్ ప్రచురించండి
హైకోర్టు ఆదేశం


హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కోర్టులో ఒక రోజు అంతా నిలబెడతామని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు.. ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్తను హైకోర్టు High court ఖండించింది. ఈ కేసు విచారణలో కేవలం సీనియర్ కౌన్సిల్, పత్యేక ప్రభుత్వ న్యాయవాది మాత్రమే హాజరుకాగ, వారి వాదనలను మాత్రమే ధర్మాసనం పరిశీలించింది. ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మరి ఏ రీతిలో బతుకమ్మ కుంట విచారణ సమయంలో రంగనాథ్ ను రోజంతా కోర్టు హాల్ లో నిలబెడతామని ఆ పత్రికలో ప్రచురించారంటూ.. ఆ వార్తలపై సుమోటోగా కేసు హైకోర్టు స్వీకరించింది. విచారణ సమయంలో హైకోర్టు అలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసింది. హైకోర్టు అలాంటి వ్యాఖ్యలు చేయదు, సెన్సేషనల్ రిపోర్టింగ్ కోసం కోర్టు వ్యాఖ్యలను వక్రీకరించకూడదు, అని హైకోర్టు స్పష్టం చేసింది. తప్పుగా ప్రచురించిన ఈ వార్త పై కరెక్షన్ న్యూస్ ప్రచురించాలని ఆ పత్రికను ఆదేశించింది.

Leave a Reply