prabhas | యూనిట్ కారుకు ప్రమాదం.. ఒకరు మృతి
prabhas | యూనిట్ కారుకు ప్రమాదం.. ఒకరు మృతి
prabhas | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్ సమయంలో విషాదం చోటుచేసుకుంది. షూటింగ్‌కు వెళ్తున్న యూనిట్ సభ్యుల కారు ప్రమాదానికి గురవడంతో ఒకరు మృతిచెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ వార్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం నగర పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది.
ఇవాళ ఉదయం షూటింగ్‌కు వెళ్తున్న స్టాఫ్ కారు అబ్దుల్లాపూర్ మెట్ వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు.
ఈ ప్రమాదంతో ‘ఫౌజీ’ చిత్ర యూనిట్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. మృతుడి కుటుంబానికి చిత్ర బృందం ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

