PEDDI | ఇది ప్రీ-రిలీజ్ ఈవెంట్ కాదు.. సక్సెస్ మీట్‌లా ఉంది..

PEDDI | ఇది ప్రీ-రిలీజ్ ఈవెంట్ కాదు.. సక్సెస్ మీట్‌లా ఉంది..
బెజవాడ నగరం మెగా అభిమానుల కేరింతలు, హర్షధ్వానాలతో సినీ సంబరాన్ని తలపించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ చిత్ర వేడుక విజయవాడలో అత్యంత వైభవంగా జరిగింది
ఈ ఈవెంట్ లో మాట్లాడిన హీరో రామ్ చరణ్, విజయవాడలో జరుగుతున్న కార్యక్రమం ప్రీ రిలీజ్ వేడుక కంటే సక్సెస్ మీట్‌ను తలపిస్తోందని వ్యాఖ్యానించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన కేశినేని చిన్ని, మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు నిర్వాహక బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
‘పెద్ది’ కథ విన్న క్షణం నుంచే అది తన హృదయానికి అత్యంత దగ్గరైన చిత్రంగా అనిపించిందని రామ్ చరణ్ చెప్పారు. దర్శకుడు బుచ్చిబాబు భవిష్యత్తులో దేశంలోని అగ్ర దర్శకుల సరసన నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తండ్రి చిరంజీవి, బాబాయి పవన్ కళ్యాణ్ వంటి సినీ నేపథ్య కుటుంబంలో పెరిగిన తనకు సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదని పేర్కొంటూ, జీవితాంతం ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటానని అభిమానులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అభిమానుల కేరింతలు, హర్షధ్వానాల మధ్య ‘పెద్ది’ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.
