యూరియా కొరత లేదు : విప్ విజయరమణ రావు

  • జిల్లాలో 20 వేల మెట్రిక్ టన్నుల నిల్వలు..
  • ఎస్సారెస్పీ ద్వారా సంవృద్ధిగా సాగనీరు..
  • ప్రభుత్వ విప్ విజయరమణ రావు..

పెద్దపల్లి ఆంధ్రప్రభ : జిల్లాలో యూరియా కొత్త లేదని రైతన్నలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు తెలియజేశారు. శుక్రవారం రాత్రి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల మరియు జిల్లా వ్యవసాయ అధికారులతో వానాకాలం సీజన్ దృష్ట్యా పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రారంభమైన వర్షాకాలం సీజన్లో పంటల సాగు వివరాలు, యూరియా అవసరం మరియు ప్రస్తుత నిలువలు, యూరియా బుకింగ్ యాప్ ప్రారంభం గురించి వ్యవసాయ అధికారులతో చర్చించడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రస్తుత వానకాలం సీజన్లో పంట అంచనాలకు గాను ఎలినో ప్రభావంతో వరి పంట సాగు తగ్గిపోయే అవకాశం ఉందని, జూలై మొదటి వారం లోపు పంట వివరాలను సమర్పించాలని అధికారును ఆదేశించామన్నారు.

20 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు

జిల్లాలో 20 వేల మెట్రిక్ టన్నుల యూరియా నిలువ ఉందని జిల్లాలో తగ్గుతున్న సాగుకు అనుకూలంగా యూరియా బస్తాలు ఉంటాయని, యూరియా కొరత అనే అంశానికి తావు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు.