జైపూర్‌లో కమ్యూనిటీ భవనానికి భూమిపూజ

జైపూర్‌లో కమ్యూనిటీ భవనానికి భూమిపూజ

సీఎస్‌ఆర్ నిధులతో రూ.25 లక్షల వ్యయం..

నాణ్యతతో పనులు పూర్తి చేయాలని మంత్రి వివేక్ ఆదేశం

జైపూర్, ఆంధ్రప్రభ: జైపూర్ మండల కేంద్రంలో కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కమ్యూనిటీ భవన నిర్మాణానికి సీఎస్‌ఆర్ నిధుల నుంచి రూ.25 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలు నిర్వహించేందుకు ఇటువంటి భవనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

నిర్దేశిత గడువులోపు నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, గ్రామ సర్పంచ్ కూన భాస్కర్, ఉప సర్పంచ్ శ్రవణ్, ఎంపీవో బాపురావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విశ్వంభర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మంతెన లక్ష్మణ్, అంబల సంపత్ రెడ్డి, అంబల రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.