RR | వ‌ర్ష‌పు నీటితో చెరువుగా మారిన ఫతేపూర్ ఫ్లైఓవర్ పరిసరాలు!

శంకర్ పల్లి, మార్చి 22 (ఆంధ్రప్రభ) : శుక్రవారం రాత్రి ఆకస్మికంగా కురిసిన భారీ వర్షానికి మున్సిపాలిటీ పరిధిలోని ఫతేపూర్ ఫ్లైఓవర్ కింద భారీగా నీరుచేరడంతో ప్రతినిత్యం రాకపోకలు నిర్వహించుకునే వాహన దారులకు తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. రోడ్డు వేసే క్రమంలో గుంతలు ఏర్పడడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రోడ్డుపై ఉన్న నీళ్లను తొలగించే ఏర్పాట్లు లేకపోవడం వలన, శనివారం మధ్యాహ్నం దాదాపు మూడు గంటల వరకు కూడా ఈ పరిస్థితి అలాగే కొనసాగింది. పరిస్థితిని సమీక్షించేందుకు మున్సిపల్ కమిషనర్ యోగేష్ స్థానిక ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గౌడ్ రోడ్లు భవనాల శాఖ అధికారులు పరిస్థితులను పరిశీలించారు.

మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన సమస్య అయిన ఫతేపూర్ రోడ్డు ఫ్లైఓవర్ కింది పరిసరాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపియ్యాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మండల పరిధిలోని దాదాపు పది గ్రామాలకు ఈ రోడ్డే ప్రధానమైన రోడ్డు. ఇంతటి ప్రాధాన్యత గల ఈ రోడ్డును ఇలా వదిలిపెట్టడం ఎంతవరకు సమంజసమ‌ని పలువురు వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. వెంటనే నీటిని తొలగించి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

కొంతకాలంగా సమస్య.. పరిష్కారం కాదు ఫైర్ ఇంజన్ సమీపన రోడ్డుపై నిలిచిన నీరు

వికారాబాద్, మార్చి 22 ( ఆంధ్రప్రభ) : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఫైర్ ఇంజన్ స్టేషన్ సమీపంలో గల రోడ్డుపై శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వర్షపు నీరు చేరింది. గత కొంతకాలంగా ఈ రోడ్డుపై నీరు నిలుస్తుండడంతో సమస్యకు పరిష్కారం చూపడం లేదు. సంబంధిత‌ అధికారులు ఈ విషయంలో ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవు. శుక్రవారం రాత్రి భారీ వర్షం కురవడంతో ఈ రోడ్డుపై పెద్ద ఎత్తున నీరు చేరింది. ఈ మార్గం గుండా పలు కళాశాలల‌కు, ఆసుపత్రులకు, పీఏసీఎస్ కు దారి ఉన్న కారణంగా ఈమార్గం గుండా పలు వాహనదారులు, పాదచారులు వెళ్తుంటారు. ఈ విషయమై సంభవిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *