Sangareddy | సామాజిక విప్లవకారుడు మహాత్మా ఫూలే
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి.ప్రభుగౌడ్
Sangareddy | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు పోరాడిన సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే (Mahatma Jyotirao Phule) అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి.ప్రభుగౌడ్ అన్నారు. జ్యోతీబా ఫూలే వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఫూలే విగ్రహానికి శుక్రవారం బహుజన సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
ప్రభుగౌడ్ (Prabhugaud) మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయులు ఫూలే దంపతులని కొనియాడారు. ప్రభుత్వం ఫూలే దంపతుల జయంతి, వర్ధంతిలను అధికారికంగా జరపాలని కోరారు. బహుజన సంఘం నాయకులు ( Bahujan Sangam Leaders )మాదేవిని అనంతయ్య, సీహెచ్ రాములు, అశోక్, మాణిక్యం, బీసీజేఏసీ వర్కింగ్ చైర్మన్లు కుమ్మరి సాయిలు, గోకుల్ కృష్ణ, వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర, కన్వీనర్ మల్లికార్జున్ పాటిల్, డాక్టర్ కొప్పేర వెంకట హరిహర కిషన్, మహేష్ కుమార్, సుధాకర్ గౌడ్, బహుజన నాయకులు డప్పోళ్ల రమేష్, పాండురంగం, నందకిషోర్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయిబాష, నాయికోటి రాజు, శ్రీనివాస్, చంద్ర మోహన్ చారి, వేణుగోపాల్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

