కొనసాగుతున్న 99 రోజుల ప్రగతి ప్రణాళిక..

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా మండలంలోని మోడల్ స్కూల్ లో విద్యార్థులచే యోగ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి పాల్గొన్నారు. మే 18 నుండి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న క్రీడా మరియు యువజన వారోత్సవాల్లో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పల్లె మల్లారెడ్డి, వార్డ్ సభ్యులు సూరపెళ్లి వెంకటేష్, పందుల యాదగిరి గౌడ్, బల్గూరి శివ, పంచాయతీ కార్యదర్శి సిహెచ్ నవీన్ కుమార్, వివిధ గ్రామ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply