నిరుపేదలకు సొంతింటి కల సాకరమే ప్రభుత్వ లక్ష్యం
హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; నిరుపేదలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని అన్నారు. వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు.గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 65వ డివిజన్ పరిధిలోని ఎల్లాపూర్ గ్రామానికి చెందిన భాషబోయిన ప్రియాంక ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం నుంచి కేటాయించిన రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో తమ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నారు.
నూతన గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని గృహప్రవేశం చేసిన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తామని తెలిపారు. పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల కల నెరవేరుతుందని, ఇలాంటి సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పార్టీ అధ్యక్షుడు నేదునూరి సునీల్, డివిజన్ అధ్యక్షుడు అయ్యాల రామిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎరుగొండ శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ఎర్ర ప్రకాష్, శ్రీను తో పాటు డివిజన్, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…
