AP | ఆదిత్యుని సన్నిధిలో అంచనాల కమిటీ

AP | ఆదిత్యుని సన్నిధిలో అంచనాల కమిటీ

AP | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ శుక్రవారం అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. కమిటీ జిల్లాలో 27, 28 తేదీల్లో పర్యటనలో భాగంగా సూర్యనారాయణ స్వామి (Suryanarayana Swamy) వారిని దర్శించుకుని వేద పండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు. దర్శించుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ శాసన సభ అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ళ జోగేశ్వరరావు, వివి సూర్యనారాయణ రాజు పెనుమత్స, వరుదు కళ్యాణి, కమిటీతో పాటు స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ ఉన్నారు. కమిటీతో పాటు రాష్ట్ర శాసన సభ డిప్యూటీ సెక్రటరీ కె. రాజా కుమార్, అసిస్టెంట్ సెక్రటరీ వి. బిక్షం, సెక్షన్ ఆఫీసర్ టి. చిరంజీవి, ఆలయ కార్యనిర్వాహక అధికారి కెఎన్విడివి ప్రసాద్, తహసీల్దార్ గణపతిరావు, తదితరులు ఉన్నారు.