Chowdeshwari Devi | జ్యోతుల మహోత్సవం..
Chowdeshwari Devi | జ్యోతుల మహోత్సవం..
Chowdeshwari Devi, నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా నందికొట్కూరులో తోగటవీర క్షత్రియ కులదైవమైన శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతుల మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వీరణాల లక్ష్మీ ప్రసాద్ కోరారని ప్రధాన కార్యదర్శి చట్టా మురళి, ఉపాధ్యక్షుడు దేశెట్టి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం నందికొట్కూరు పట్టణంలో చౌడేశ్వరి దేవి ఆలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిపే అమ్మవారి వేడుకలకు తోగట వీర క్షత్రియ కుటుంబ సభ్యులు అందరూ ఒక పండుగలా జరుపుకుంటామని అని అన్నారు. ఈ వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, తొగటవీర క్షత్రియ, దేవాంగ కులస్థుల ఆధ్వర్యంలో చౌడేశ్వరీ దేవి జ్యోతుల మహోత్సవం సంబరంగా జరిపించే విధంగా అందరూ కలిసికట్టుగా కలిసి రావాలని అన్నారు. మూడు సంవత్సరాలకు ఒకసారి జ్యోతులు నిర్వహించడం ఆనవాయితీ అని అన్నారు. ఈ సందర్భంగా పురమానకట్ట చౌడేశ్వరీ దేవి ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వచ్చే ఫిబ్రవరి ఒకటో తారీఖున ప్రారంభం అయ్యే ఈ మహోత్సవంలో మధ్యాహ్నం 11:30 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహం బయలుదేరనున్నట్లు తెలిపారు.
ఆదివారం రాత్రి అనగా సోమవారం తెల్లవారుజామున 2గంటలకు అమ్మవారి జ్యోతి మహోత్సవం ప్రారంభం అవుతున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. జ్యోతుల ఉత్సవాల సందర్భంగా చౌడేశ్వరి దేవి ఆలయంలో జ్వాలా దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుందని.. జ్యోతుల ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని.. పట్టణమంతా అమ్మవారి నామస్మరణతో మార్మోగుతుందని అని తెలిపారు.
