టీటీడీకి రూ.2 కోట్ల విరాళం

  • శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి భారీ సాయం
  • చెరో రూ.కోటి అందించిన బయోఫోర్ సంస్థ ప్రతినిధులు

తిరుమల, ఆంధ్రప్రభ : తిరుమల తిరుపతి దేవస్థానానికి హైదరాబాద్‌కు చెందిన బయోఫోర్ ఇండియా ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు రూ.2 కోట్ల భారీ విరాళం అందించారు. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ఈ విరాళాన్ని సమర్పించారు.

సంస్థ సీఈఓ జగదీష్, సీఎస్ఓ మాణిక్ రెడ్డి పుల్లగూర్ల బుధవారం చెరో రూ.కోటి చొప్పున విరాళంగా అందజేశారు. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్. నాయుడుకు రూ.2 కోట్లకు సంబంధించిన డీడీలను అందించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు ఏ. రంగశ్రీ పాల్గొన్నారు.