POLICE | అదే పోలీసుల ధ్యేయం..

POLICE | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని పెద్దపల్లి డిసిపిబి. రామ్ రెడ్డి నాయక్ తెలియజేశారు. ఆదివారం డీసీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. పెద్దపల్లి ప్రజలతో మమేకమై ముందుకు సాగుతామన్నారు. ప్రజలు సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, వారి సమస్యల పరిష్కారానికి 24 గంటల పాటు పని చేస్తామన్నారు.
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే.. అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని, ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ కు పాల్పడితే శిక్ష తప్పదన్నారు. విజిబుల్ పోలింగ్ అమలు చేస్తామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకాల పాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
నూతన డీసీపీకి పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ, సిఐలు ప్రవీణ్, సుబ్బారెడ్డి, ఎస్ఐ లు లక్ష్మణరావు, మల్లేష్ లతోపాటు సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
