హైదరాబాద్ – అసలే ఎండాకాలం.. రాత్రివేళ కాస్త మందు పుచ్చుకోకుంటే మందుబాబులకు నిద్ర రాదు. అలాంటిది మూడురోజుల పాటు మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. ఇంతకీ కారణమేంటో తెలుసా? హైదరాబాద్ సిటీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రూల్స్‌ని అతిక్రమిస్తే చర్చలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. నేటి సాయంత్రం 4 గంటల నుంచి ఈ నెల 23 సాయంత్రం 6 గంటల వరకు మద్యం, వైన్ షాపులు మూతపడనున్నాయి. ఆ తర్వాత షాపులు ఓపెన్ కానున్నాయి.ఒక విధంగా చెప్పాలంటే మద్యం బాబులకు ఊహించని షాక్. అలాగే కౌంటింగ్ జరిగే ఈనెల 25న మద్యం దుకాణాలు క్లోజ్ చేయాలని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. కాగా,స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 23వ తేదిన జరగనుంది.
Hyderabad | మందుబాబులకు చేదు వార్త … నేటి సాయంత్రం నుంచి మూడు రోజుల పాటు షాపుల బంద్
