TG | పోలీస్ సేవా పతకాలు ప్రకటించిన ప్రభుత్వం..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ సర్వీస్ పతకాలను ప్రకటించింది. ఈ మేరకు హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ విభాగాలలో వారి సేవలకు గాను అధికారులకు ఈ పతకాలను ప్రదానం చేశారు.

పోలీస్ శాఖలో పనిచేస్తున్న గ్రేహౌండ్స్ యూనిట్‌లోని తొమ్మిది మందికి శౌర్య పతకం, 16 మందికి మహోన్నత సేవా పతకం, 92 మందికి ఉత్తమ సేవా పతకం, 47 మందికి కఠిన సేవా పతకం, 461 మందికి సాధారణ సేవా పతకం లభించాయి.

అవినీతి నిరోధక శాఖలో ఒకరికి మహోన్నత సేవా పతకం, నలుగురికి ఉత్తమ సేవా పతకం, 17 మందికి సేవా పతకాలు లభించాయి. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో ఒకరికి ఉత్తమ సేవా పతకం, మరో ఐదుగురికి సాధారణ సేవా పతకాలు లభించాయి.

డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసులో ఇద్దరికి శౌర్య పతకం, ఒకరికి మహోన్నత సేవా పతకం, ముగ్గురికి ఉత్తమ సేవా పతకం, 14 మందికి సాధారణ సేవా పతకం లభించింది.

స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగంలో ఒకరికి మహోన్నత సేవా పతకం, ముగ్గురికి ఉత్తమ సేవా పతకం, 15 మందికి సాధారణ సేవా పతకాలు లభించాయి.

Leave a Reply