కడుపు నొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య

కడుపు నొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: కడుపు నొప్పితో బాధపడుతూ ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన పల్లికొండ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై సిహెచ్.తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన కొరట్పల్లి శివ కుమార్ శివకుమార్ (25) గత కొంతకాలంగా తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ రాడ్ కు టవల్ తో ఉరివేసుకుని మృతి చెందాడు.మృతుడి తల్లి కోటిపల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు భీమ్‌గల్ ఎస్సై సిహెచ్.తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అన్నారు.
