అంజన్నఆలయనిర్మాణానికి విరివిగావిరాళాలు..

అంజన్నఆలయనిర్మాణానికి విరివిగావిరాళాలు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలపరిధిలోనిబిజ్వార్ గ్రామంలో శ్రీ వ్యాసరాయల మహర్షిచే ప్రతిష్టించిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి గర్భాలయ పునర్నిర్మాణానికి భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చేందుకు ముందుకొచ్చి తమ భక్తిని చాటుతున్నారు. దేవాలయ పునర్నిర్మాణానికి దాతలు విరివిగా విరాళాలు అందజేస్తుండగా శనివారం విశ్రాంత ప్రధానోపాధ్యాయులు రామచంద్రయ్య గౌడ్,సుశీల దంపతులు తమ వంతు సహకారంగారూ.25 వేలుఆలయ కమిటీ సభ్యులకు సమర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ ఆలయాల నిర్మాణంలో తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.కమిటీ సభ్యులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి నరసింహ చారి జోషి,వార్డు సభ్యులు రాఘవేందర్,సుధాకర్ రెడ్డి,మహేష్ గౌడ్,దరిమిది నరసింహుల,సప్పటి నరసింహ,సి రమేష్,హరినాథ్ గౌడ్,శశికాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
