దమ్మపేటలో వ్యక్తి అదృశ్యం

దమ్మపేటలో వ్యక్తి అదృశ్యం
- వారం రోజులుగా ఆచూకీ గల్లంతు
దమ్మపేట, ఆంధ్రప్రభ : వ్యక్తి అదృశ్యమైన సంఘటన దమ్మపేట మండల పరిధిలోని నాచారం లో గురువారం జరిగింది . ఈ సంఘటనకు సంబంధించి దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం నాచారం గ్రామానికి చెందిన దేరంగుల నాగరాజు రోజు వారీ కూలిపనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు . ఈ క్రమంలో ఏప్రిల్ 24 వ తేదీన పనికోసమని ఇంటి నుండి బయటకు వెళ్లాడు .
ఇంటినుండి బయటకు వెళ్లిన నాగరాజు వారం రోజులు గడిచినా ఇంటికి తిరిగి రాకపోయేసరికి సమీప బంధువుల ఇండ్లలో వెతికినప్పటికీ నాగరాజు ఆచూకీ లభ్యం కాకపోవటంతో నాగరాజు భార్య డేరంగుల సుజాత దమ్మపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది . సుజాత ఫిర్యాదు మేరకు దమ్మపేట ఎస్సై సాయికిషోర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .
