రామన్నపాలెంలో చలివేంద్రం ప్రారంభం

రామన్నపాలెంలో చలివేంద్రం ప్రారంభం

వేంసూరు, ఆంధ్రప్రభ: వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పంచాయతీ కార్యాలయానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం, పాఠశాల విద్యార్థుల కోసం, బాటసారుల దాహాన్ని తీర్చేందుకు రామన్నపాలెం గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ జుంజునూరి కృష్ణకుమారి వరప్రసాద్, ఉప సర్పంచ్, మాజీ చెరుకు అభివృద్ధి కమిటీ డైరెక్టర్ పుచ్చకాయల శంకరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవి ఎండల నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు ఎండలకు రాకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వడదెబ్బ తగల కుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకట రామకృష్ణ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply