ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండల ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఐకేపీ వీవోఏలు చేపట్టిన నిరవధిక సమ్మెకు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శుక్రవారం తరలివచ్చి పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఐకేపీ విఓఏలకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
విఓఏల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ తొగరి సత్యనారాయణ, బెల్లంపల్లి మాజీ ఎంపీపీ గొల్లపల్లి సుభాష్ రావు, బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు బొడ్డు గణేష్ గౌడ్, మండల బీఆర్ఎస్వై మాజీ అధ్యక్షుడు ఎలిగేటి మహేందర్, నాయకులు మల్లేష్, సంతోష్, రమేష్, రాజేష్ మరియు సమ్మెలో ఉన్న వివోఏలు పాల్గొన్నారు.
