ఆర్థిక సహాయం అందజేసిన మిత్రబృందం.

ఆర్థిక సహాయం అందజేసిన మిత్రబృందం.
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి ,మండలం లోని పాత మామిడిపల్లి గ్రామానికి చెందిన రంగు సామ్రాట్ ఇటీవల గుండెపోటుతో అకాల మరణం పొందాడు. అతనిది నిరుపేద కుటుంబం, అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.మృతుని పిల్లల భవిష్యత్ కోసం అతని మిత్రుడు శీనునాయక్ కు తోటి మిత్రులు విషయం తెలపడంతో తెలంగాణ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.6,61, 203 విరాళాలు సేకరించి సామ్రాట్ భార్య శైలజకు బుధవారం అందించారు. సామ్రాట్ తో పదోతరగతి చదివిన తోటి మిత్రులు కూడా విరాళాలు సేకరించి ఆర్థిక సహాయం అందిచమన్నారు.పెద్ద మొత్తం లో మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మిత్ర బృందాన్ని పలువురు అభినంధించారు.
