తెగిపడ్డ విద్యుత్ తీగ.. ఆవు మృతి
కడెం, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ తీగ తెగిపడి కిందపడటంతో కరెంట్ షాక్ తగిలి ఓ ఆవు మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు బెడద రాజన్నకు చెందిన ఆవు గ్రామ శివారులో మేత మేస్తుండగా, గురువారం ఈదురుగాలుల కారణంగా విద్యుత్ లైన్ తీగ తెగి నేలపై పడింది. ఆ సమయంలో ఆవు ఆ తీగను తాకడంతో కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
మృతి చెందిన ఆవు విలువ సుమారు రూ.70 వేల వరకు ఉంటుందని బాధిత రైతు బెడద రాజన్న తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తక్షణమే నష్టపరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులను రైతు బెడద రాజన్న కోరారు.
