భూ పోరాట సభ నేపథ్యంలో ముందస్తు అరెస్టులు
ఆలేరు, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లో నిర్వహించనున్న మలిదశ తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాట సభ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో గురువారం పోలీసులు ముందస్తు అరెస్టులు చేపట్టారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి తమ్మడి పద్మారావుతో పాటు ఉద్యమకారుడు చెక్క వెంకటేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సభకు వెళ్లకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ అరెస్టులు చేసినట్లు సమాచారం.
భూ పోరాట సభ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆలేరు ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
