రాపోలు గ్రామ రైతుల నిరసన..

రాపోలు గ్రామ రైతుల నిరసన..
వికారాబాద్ జిల్లా, పరిగి, ఆంధ్రప్రభ : ఇండస్ట్రీయల్ కారిడార్ కోసం తమ భూములు తీసుకోవద్దని ఆందోళన. పరిగి-షాద్ నగర్ ప్రధాన రహదారి రాపోలు గేట్ పై బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు…రైతుల నిరసనతో పరిగి షాద్ నగర్ ప్రదాన రహదారి పై భారీగా నిలిచిపోయిన వాహనాలు… రైతుల నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు… రైతులు పోలీసుల మధ్య వాగ్వాదం… తోపులాట దీంతో తీవ్ర ఉద్రిక్తత…. రైతులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసిన పోలీసులు… కాడ్లాపూర్, రాపోలు రెండు గ్రామాల్లో కలిసి 1197 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం..దీంట్లో 260 ఎకరాల పట్టా భూములు కాగా 937 ఎకరాల లావణి పట్టా భూముల సేకరణ కోసం నోటిఫికేషన్…జీవనాధారమైన భూములు లాక్కొవద్దని రైతుల నిరసన



