మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం..
మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం..
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలో రైతులకు ఊరటనిచ్చే విధంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలతో నేరుగా కొనుగోళ్లు నిర్వహించడం వల్ల మధ్యవర్తుల దోపిడీ తగ్గుతుందని తెలిపారు. ప్రస్తుతం మొక్కజొన్నకు క్వింటాల్‌కు రూ.2400 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించగా, పొద్దుతిరుగుడు పంటకు రూ.7721 ధర ప్రకటించినట్లు తెలిపారు. రైతులు తమ పంటలను నేరుగా కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి విక్రయించుకోవాలని సూచించారు. రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు దామోదర్, పార్టీ మండలాధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఎ.ఎం.సి వైస్ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు, మార్కెట్ కమిటీ సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు.
