Telangana | హైటెన్షన్ వైర్లు తగిలి..
Telangana | హైటెన్షన్ వైర్లు తగిలి..
Telangana | ఆంధ్రప్రభ, వెడ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. పటాసులతో వెళ్తున్న లారీకి అగ్ని ప్రమాదం చోటుచేసుకుని కాసేపు భయాందోళన నెలకొంది.
మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడ సమీపంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న లారీ హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీలో భారీగా బాణాసంచా లోడు ఉండటంతో వరుసగా పేలుళ్లు సంభవించి ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.
ఈ ఘటనలో లారీ పూర్తిగా దగ్ధమైంది. అయితే అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమికంగా హైటెన్షన్ విద్యుత్ తీగలే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
