చిన్నారుల ఎదుగుదలలో అంగన్ వాడీలు కీలకం..

చిన్నారుల ఎదుగుదలలో అంగన్ వాడీలు కీలకం..

  • పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి..
  • ప్రాథమిక స్థాయి నుంచే సకల సౌకర్యాలు
  • రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, ఆంధ్రప్రభ : చిన్నారుల ఎదుగుదలతోపాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై వేములవాడ పట్టణంలోని శాత్రాజ్పల్లిలో నూతన అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల ప్రణాళిక పెట్టుకొని ప్రతి వారం ఒక్కో శాఖ ఆధ్వర్యంలో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పలు కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నట్లు తెలిపారు. చిన్నారుల సమగ్ర అభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు కీలకంగా పనిచేస్తాయన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం, ప్రాథమిక విద్య అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో విద్యా, ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చె యడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పసిపిల్లలలో పోషకాహార లోపాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు నాణ్య మైన పోష కాహారం అందించడంతో పాటు చిన్నారులకు ప్రాథమిక విద్య, ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడంలో అంగన్వాడీ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతోందన్నారు. పక్కా భవనాలు లేని అంగన్వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో విద్యా విధానంలో సమూల మార్పులు చేపడుతున్నట్లు తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైందని, రూ.200 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మిస్తున్నామని వెల్లడించారు. నాణ్యమైన భోజనం, విద్య అందిస్తామని తెలిపారు. కాస్మొటిక్, డైట్ చార్జీలు పెంచామని, త్వరలోనే తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు రానున్నాయన్నారు. నియోజకవర్గానికి ఒకటి వస్తాయని, ఒక్కో స్కూల్లో 1500 మంది విద్యార్థులు చదివే అవకాశం ఉంటుందన్నారు.

రాష్ట్రంలో మొత్తం 36 వేల బెడ్స్ ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. రైతు ప్రయోజనాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల పొలాసా తరహాలో వేములవాడ నియోజకవర్గ పరిధిలో మర్రిపల్లి గ్రామంలో 40 ఎకరాల్లో నూతన రైతు విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. తద్వారా రైతులకు నూతన వ్యవసాయ విధానంలో, నూతన వంగడాలతో రైతులు వ్యవసాయం చేసేలా ప్రోత్సాహకం అందజేయున్నట్లు తెలిపారు. శాత్రాజ్పల్లి నిర్మాణంలో ఉన్న ఆసుపత్రిని తొందరలోనే పూర్తి చేసుకొని త్వరలోనే ప్రారంభం చేసుకుందామన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Leave a Reply