కోర్టు తీర్పు మావైపే వస్తుంది..

కోర్టు తీర్పు మావైపే వస్తుంది..

జంపింగ్ ఎమ్మెల్యేలపై అనాహారత వేటు తప్పదు
కడియం, దానం నాగేందర్ లను కాపాడుతున్నది స్పీకరే
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ, ఆంధ్రప్రభ : జంపింగ్ ఎమ్మెల్యేలపై స్పీకర్ తీరు సరికాదని కోర్టు ఇచ్చే తీర్పు బిఆర్ఎస్ వైపు వస్తుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని కలెక్ట్ కార్యాలయంలో బుధవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విలేకరులతో మాట్లాడారు. మొదటినుండే మేము చెబుతూ వస్తున్నామని స్పీకర్ ఆనర్హత ఎమ్మెల్యేలవైపే మొగ్గు చూపుతారని మాకు తెలుసని అన్నారు. కోర్టు తీర్పు కచ్చితంగా మాకు అనుకూలంగా వస్తుంది పదిమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని , బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ కాలం గడుపుకుంటున్న ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్పాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. గత ప్రభుత్వంలో పార్టీలకతీతంగా పనిచేసే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అభ్యర్థులకు కూడా సమానంగా నిధులు కేటాయించి అభివృద్ధి పరిచిన ఘనత కేసిఆర్ ప్రభుత్వాని దని అన్నారు. ఇప్పటికైనా పార్టీలకతీతంగా సరైన నిధులు అందజేసి ఆ ప్రాంతాలను అభివృద్ధి పరచడంలో దృష్టి సారించాలని లేదంటే తదనంతరం జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Leave a Reply