మహిళా శక్తి భవన నిర్మాణానికి శంకుస్థాపన

మహిళా శక్తి భవన నిర్మాణానికి శంకుస్థాపన

కేసముద్రం, ఆంధ్రప్రభ:

కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో మహిళా శక్తి భవన నిర్మాణానికి స్థానిక ఎంపీఓ హరిష్,సర్పంచ్ ఏర్పుల సునీత కుమారస్వామిలు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఉప్పరపల్లి గ్రామంలో మహిళా శక్తి కార్యాలయం ను స్వయం సహాయక సంఘాల మహిళలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని శిక్షణ కార్యక్రమాల ద్వారా మహిళా శక్తి భవనాలను ఉపయోగించుకోవాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి భవనానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు.

అంతేకాకుండా మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తుందని సెర్ఫ్ మహిళా శక్తి భవనాలు మంజూరు చేసి వారి యొక్క సమస్యలు పరిష్కరించుకోవడంలో కార్యాలయాలు సద్వినియోగ పరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆవుల ఐలయ్య, వార్డు సభ్యులు బోనగిరి జ్యోతి బండారు ప్రియాంక, సుధగాని మమత, కుండే బాల కుమార్, మంద ప్రవీణ్,వి. వో.ఎ శాగంటి శ్రీనివాస్,గ్రామైక్య సంఘాల అధ్యక్షులు బండారు పద్మ,అరిగే శాంతమ్మ, నాయకులు సంకు శ్రీనివాస్ రెడ్డి,నూకల వెంకటేశ్వర్లు బండారు గోపి,సత్యనారాయణ బండారు బుచ్చి రాములు,స్వయం సహాయక సంఘాల మహిళలు గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply