ఎస్‌ఐఆర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ రాఘవేందర్

వికారాబాద్, ఆంధ్రప్రభ : ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియను 23వ వార్డు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్ మున్సిపల్ 23వ వార్డు కౌన్సిలర్ వి. రాఘవేందర్ కోరారు.

శనివారం 23వ వార్డులో బీఎల్‌ఓ స్వరూపతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఫారాలను సక్రమంగా నింపి, అవసరమైన పత్రాలను జతచేసి వీలైనంత త్వరగా అప్‌లోడ్ చేసుకోవాలని వార్డు ప్రజలకు సూచించారు.

తన వార్డు ప్రజల సమస్యల పరిష్కారం కోసం 24 గంటలూ అందుబాటులో ఉంటానని కౌన్సిలర్ రాఘవేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రజాక్, హాజీ పాషా, వార్డు ప్రజలు పాల్గొన్నారు.