అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా దారా మాధవరావు నియామకం..

అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా దారా మాధవరావు నియామకం..

ఎమ్మెల్యే కొలికపూడిని కలసి కృతజ్ఞతలు

తిరువూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లాలోని సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కోర్టుకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా నియమితులైన దారా మాధవరావు మంగళవారం తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో నిజాయితీ, నిబద్ధతతో పాటు ప్రజాసేవ భావనతో ముందుకు సాగాలని సూచించారు. ప్రజలకు వేగవంతమైన న్యాయం అందేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. దారా మాధవరావు నియామకం తిరువూరు ప్రాంతానికి గర్వకారణమని పేర్కొంటూ అభినందనలు తెలిపారు.

న్యాయవ్యవస్థలో బాధ్యతాయుతమైన పదవులు చేపట్టే వారు సమాజానికి ఆదర్శంగా నిలవాలని, ఈ నియామకం యువ న్యాయవాదులకు ప్రేరణగా నిలుస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ తమ వర్గానికి చెందిన వ్యక్తి ఈ కీలక పదవికి ఎంపిక కావడం సంతోషకరమని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ పెద్దలు, న్యాయవాదులు, పట్టణ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.