ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం..

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : పట్టణంలోని 8 వ వార్డులో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులైన గుండ్లపల్లి సారిక సత్యం దంపతులకు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆప్యాయంగా అభినందించి, పట్టు వస్రాలు. పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు శాశ్వత నివాస సౌకర్యం కల్పించడం జరుగుతోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో 8 వ వార్డు కౌన్సిలర్ పేరబోయిన సత్యనారాయణ, 11వ వార్డు కౌన్సిలర్ ముఖ్యర్ల మల్లేష్ యాదవ్. 2 వ వార్డ్ కౌన్సిలర్ బూడిద మధు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుండ్లపల్లి భరత్ గౌడ్, బరిగే రామచందర్, కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షులు బందారపు బిక్షపతి, లు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
