ప్రైవేటు పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాల ముద్దు

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని అల్లందేవిచెర్వు గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రైవేటు పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అంటూ గ్రామ సర్పంచ్ సుర్వి సౌజన్య రాజు గౌడ్ ఫ్ల కార్డులతో ఇంటింటికి తిరిగారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు కనకసేన ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..గ్రామ ప్రజలు పిల్లల తల్లిదండ్రులకు విద్య ప్రాముఖ్యతను వివరించారు.
గ్రామంలో ప్రస్తుతం ఉన్న పాఠశాల అభివృద్ధి కోసం ఈ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ సహకారంతో ఐదు తరగతి గదులతో నూతన భవనం నిర్మిస్తున్నామన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ ఉపాధ్యాయులను నియమించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముక్యర్ల కవిత స్వామి యాదవ్ వార్డు సభ్యులు అంతటి శివశంకర్ గౌడ్, గుండు జంగయ్య గౌడ్, విద్యా కమిటీ చైర్మన్ సుర్వి అలివేలు,అంగన్వాడి టీచర్ సుర్వి ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.
