రైలులో చోరీల కలకలం..

రైలులో చోరీల కలకలం..
రైల్వే జేఈ అరెస్ట్.. ఉద్యోగం రైల్ లో.. దొంగతనం..
రైల్ లో సీరియల్ దొంగ.. చీకటి జీవితం…
సాంకేతికతో కేసు గుర్తింపు…
ఏడు కేసులకు సంబంధించి..
రూ.50 లక్షల విలువైన బంగారం, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం
రైల్వే డిఎస్పి శ్రీనివాసాచారి…
కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ : రైలు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న రైల్వే జేఈ ని..కర్నూలు రైల్వే పోలీస్ సర్కిల్, ఆర్‌పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేసి. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు గుంతకల్ రైల్వే డీఎస్పీ కె. శ్రీనివాసాచారి తెలిపారు. బుధవారం రైల్వే ప్రభుత్వ పోలీస్ కార్యాలయంలో. చోరీ కేసులో రైల్వే జేఈ అరెస్టు. కు సంబంధించి. డి.ఎస్.పి వివరాలను వెల్లడించారు
అనంతపురం జిల్లా యాడికికి చెందిన పి. బాలరాజు (36).. 2013లో రైల్వే టెక్నీషియన్ గా. ఉద్యోగం లో చేరారు. ప్రస్తుతం ఆదోని విభాగంలో రైల్వే శాఖలో జూనియర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

ఉద్యోగ రీత్యా తరచూ రైళ్లలో ప్రయాణించే అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో వారి బ్యాగులను అపహరించేవాడని తెలిపారు. బంగారం, నగదు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు వంటి విలువైన వస్తువులను మాత్రమే తీసుకుని, మిగతా వస్తువులను తగలబెట్టి ఆధారాలు లేకుండా చేసేవాడని వెల్లడించారు.
సంవత్సరంలో నంద్యాల రైల్వే స్టేషన్ పరిధిలో. బ్యాగు చోరీ అయిందని బాధితుడుఫిర్యాదు మేరకు నమోదైన ఫిర్యాదులపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. వివిధ రైల్వే స్టేషన్లలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా నిందితుడి కదలికలు అనుమానాస్పదంగా గుర్తించారు. బుధవారం కర్నూలు పట్టణ శివార్లలోని ఆల్ ఇండియా రేడియో స్టేషన్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నంద్యాలకు సంబంధించి నాలుగు. కర్నూలుకు సంబంధించి. 3 మూడు కేసులలోతన నేరాలను అంగీకరించాడు.

దొంగతనాలకు ఉపయోగించిన ఫోర్డ్ కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడి నుంచి కారుతోపాటు సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు, 13 మొబైల్ ఫోన్లు, 6 ల్యాప్‌టాప్‌లు, ఒక ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన కర్నూలు ఆర్‌పి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. శ్రీనాథ్ రెడ్డి, ఐపీఎఫ్ రామమోహన్, రవీందర్, నాగభూషణం, జీఆర్‌పీ ఎస్‌ఐ డి. లలిత తదితర సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. రైలు ప్రయాణికులు తమ విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు…..
దొంగతనాలకు పాల్పడితే కాల్పులే..
ప్రయాణికుల భద్రత లక్ష్యం..
రైలు. లో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని చోర్లకు పాల్పడే వారిపై. కఠిన చర్యలు తీసుకుంటామని
అవసరమైతే. కలుస్తాం అని రైల్వే డిఎస్పి శ్రీనివాసచారి హెచ్చరించారు. ఇటీవల రైల్వే దొంగతనాలకు సంబంధించి రైల్వే ఉన్నత అధికారులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారని. డిఎస్పి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కర్నూల్ ఇన్స్పెక్టర్ ఎం శీనాథరెడ్డి, రైల్వే ఐపిఎఫ్ రామ్మోహన్, నంద్యాల రైల్వే ఐపిఎఫ్ రవీందర్, డోన్ ఐపీఎఫ్ నాగభూషణంతోపాటు జి ఆర్ పి ఎఫ్ లలిత, ఎస్సై బిందు మాధవి, కుమారి, ఆర్ పి ఎఫ్ క్రైమ్ బ్రాంచ్ ఏఎస్ఐ వేణు, కర్నూలు డోన్ నంద్యాల ఆర్ పి ఎఫ్,జి ఆర్ పి, పోలీసులు పాల్గొన్నారు.
