బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు

చిలుపూర్, (ఆంధ్రప్రభ): కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి గ్రామానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో చిలుపూర్ మండలంలోని పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ఆదివారం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎడవెల్లి కృష్ణారెడ్డి, నారగోని రాజు, దివాకర్ రెడ్డి, బత్తుల రాజన్‌బాబు, రంగు హరీష్‌తో పాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా ఎడవెల్లి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, కేటీఆర్ పర్యటనను అడ్డుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడి పర్యటనను అడ్డుకోవడం సరికాదని, అరెస్టులతో బీఆర్ఎస్ కార్యక్రమాలను అడ్డుకోలేరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.