నూతన ఎంపీడీఓగా రామకృష్ణ బాధ్యతల స్వీకరణ

కన్నాయిగూడెం, (ఆంధ్రప్రభ): కన్నాయిగూడెం మండల నూతన మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)గా రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. గతంలో భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఎంపీడీఓగా విధులు నిర్వహించిన ఆయనను ప్రభుత్వం కన్నాయిగూడెం మండలానికి బదిలీ చేస్తూ నియమించింది. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మండల అధికారులు, ఉద్యోగులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మండల అధికారులు పాల్గొన్నారు.