జిల్లా స్థాయి ఉత్తమ ఏఏపీసీ చైర్‌పర్సన్‌గా సుమలత ఎంపిక

జిల్లా స్థాయి ఉత్తమ ఏఏపీసీ చైర్‌పర్సన్‌గా సుమలత ఎంపిక


కలెక్టర్, ఎమ్మెల్యే చేతుల మీదుగా సన్మానం

చిట్యాల, ఆంధ్రప్రభ: భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట ఎంపీపీ ఎస్ ప్రాథమిక పాఠశాల ఏఏపీసీ చైర్‌పర్సన్ జీడీ సుమలత జిల్లా స్థాయి ఉత్తమ ఏఏపీసీ చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు.ఈ సందర్భంగా బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే గంధారి సత్యనారాయణ రావు, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ కలిసి జీడి సుమలతను శాలువాతో సన్మానించారు.

నవాబుపేట పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల నమోదు (ఎన్‌రోల్మెంట్) పెంపుకు ఆమె అందిస్తున్న సేవలను గుర్తించి జిల్లా స్థాయిలో ఉత్తమ ఏఏపీసీ చైర్‌పర్సన్‌గా ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. కిరణ్‌కుమార్‌తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు జీడి సుమలతకు అభినందనలు తెలిపారు.

Leave a Reply