401billion tons | కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు

401billion tons | కేంద్ర కేబినెట్ లో కీలక నిర్ణయాలు

401billion tons | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైతులు, ఇంధన రంగం, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (MSP) పెంపుతో పాటు కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి భారీగా నిధులు కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

దేశంలో ఇంధన అవసరాలను తీర్చేందుకు కేంద్రం రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఎల్‌ఎన్‌జీ దిగుమతులపై భారం తగ్గుతుందని కేంద్రం వెల్లడించింది. భారత్‌లో 401 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని, ఇవి సుమారు 400 ఏళ్ల అవసరాలకు సరిపోతాయని పేర్కొంది. ఈ రంగంలో దాదాపు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశముందని కేంద్రం అంచనా వేసింది.

రైతులకు మేలు చేసేలా ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.2 లక్షల 60 వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలిపింది. పెట్టుబడి ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి మద్దతు ధరలను నిర్ణయించనున్నారు. విర పంటకు కనీస మద్దతు ధరను రూ.2,441గా నిర్ణయించగా, వరి గ్రేడ్-ఏ రకానికి రూ.2,461 మద్దతు ధరగా ఖరారు చేశారు. అలాగే నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టు ఆధునీకరణకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Leave a Reply