ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; భారతదేశం గర్వించదగ్గ గొప్ప నాయకుడు మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ అని ఎంఆర్ పిఎస్ రాష్ట్ర నాయకులు బోయ రామచంద్రం అన్నారు. చౌటుప్పల్ పట్టణంలో ఆదివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఎం ఆర్ పి ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ముందు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేడి యాదయ్య, బోయ రాము, చింతల సాయిలు, సుక్క సుదర్శన్, కట్టెల లింగస్వామి, దొనకొండ కృష్ణ, బద్రి గాలయ్య, బోయ సృజన్, ముత్యాల గణేష్, దొనకొండ కిరణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.