TG | వేరుశనగ రైతులకు శిక్షణ….

TG | వేరుశనగ రైతులకు శిక్షణ….
TG | మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు వేరుశనగ పంట సాగు చేస్తున్న రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎస్. పద్మజ పాల్గొని వేరుశనగ పంటలో అనుసరించాల్సిన ఆధునిక యాజమాన్య పద్ధతులు, చీడపీడల నివారణ చర్యలు, ఎరువుల సమతుల్య వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. సరైన సాగు పద్ధతులు పాటించడం ద్వారా దిగుబడులు పెరుగుతాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి నిఖిల్ కుమార్, గ్రామ సర్పంచ్ మాల్గు శ్రీను, మునుగోడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమనపల్లి సైదులు,రైతులు భీమనపల్లి శంకరయ్య, మహేశ్వరం శంకరయ్య, జాజుల యాదయ్య, జాజుల కృష్ణయ్య, మునుకుంట్ల పరమేష్, నందిపాటి భూపాల్, లింగాల శేఖర్, నరసింహ, ఏనుగుల రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.
