Peru  Trajedy :  విషాద సండుగ AndhraPrabha Real News

Peru  Trajedy :  విషాద సండుగ AndhraPrabha Real News

మచు పిచ్చు దారిలో  రెండు రైళ్లు ఢీ

డ్రైవరు దుర్మరణం

40 మందికి గాయాలు

సహాయక చర్యల్లో.. ఆంబులెన్సులు..

వైద్య సిబ్బంది తరలింపు  

( ఆంధ్రప్రభ, లిమా)

దక్షిణ అమెరికాలో.. అదొక అందాల లోకం. పెరూలోని మచు పిచ్చు (Machu Picchu). సముద్ర మట్టం నుంచి 8,200 అడుగుల ఎత్తులో.. పక్కనే మేఘాల్లో తేలియాడుతూ..పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి..

Peru  Trajedy

నూతన సంవత్సరానికి స్వాగత సంబరంలో పాల్గొనేందుకు బయలు దేరిన పర్యాటక జనం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రెండు రైళ్లు ఢీకొన్నాయి.  భయంతో గజగజలాడిపోయింది. అప్పటి వరకూ జోకులతో చిరునవ్వులు చిందించిన పర్యాటకులు అకస్మాత్తుగా దేవుడా.. అని అరిచారు

Peru  Trajedy

Peru  Trajedy

. కొందరు తలలు పగిలాయి. మరికొందరి చేతులు విరిగాయి. కాళ్లు విరిగాయి. హాహాకారాలు.. ఆర్తనాదాలతో (Trajedy) ఆప్రాంతం దద్దరిల్లిపోయింది.  భారత కాలమానం (IST) ప్రకారం 2025 డిసెంబర్ 30  మంగళవారం   రాత్రి 18:30 (6:30 PM) గంటలకు రెండు రైళ్లు  ఢీకొన్నాయి.

Peru  Trajedy

ఈ సంఘటన, 2025న జరిగింది.  ఒల్లంటాయ్టంబో (Ollantaytambo) పట్టణం, పర్యాటకకేంద్రం  మచు పిచ్చుతో అనుసంధానం చేసే సింగిల్ ట్రాక్ లైన్‌లో, ఖోరీవాయ్ రచీనా (Qoriwayrachina) అనే పురావస్తు ప్రదేశం సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్నాయి.

Peru  Trajedy

Peru  Trajedy

ఈ రైళ్లు  పెరూ రైల్ (PeruRail), ఇంకా రైల్ (Inca Rail) కంపెనీలకు చెందినవి.   ఈ ప్రమాదంలో ఒక రైలు డ్రైవర్ మరణించాడు.  సుమారు 40 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు.  ప్రసిద్ధ ఇంకా సిటాడెల్‌కు సమీపంలోని   కుస్కో నగరం అధికారుల కథనం ప్రకారం,

Peru  Trajedy

 ప్రయాణికులు పంపిన వీడియోలలో ట్రాక్‌ల పక్కన పడి క్షతగాత్రులు,  రెండు దెబ్బతిన్న లోకోమోటివ్‌లు సమీపంలో   కనిపించాయి.  అంబులెన్స్‌లు,  వైద్య సిబ్బందిని నేరుగా రోడ్డు సౌకర్యం లేని మారుమూల ఆండియన్ ప్రాంతంలో ఉన్న ప్రదేశానికి తరలించారు.

Peru  Trajedy

Peru  Trajedy

1983 నుండి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన  ఈ పురాతన కోట   ప్రతిరోజూ సగటున 4,500 మంది పర్యాటకులు చేరుతారు. వీరిలో చాలామంది విదేశీయులు అధికంగా ఉంటారు.  ఆండీస్ పర్వతాలలో ఎత్తైన ఈ చారిత్రాత్మక ప్రదేశానికి చేరుకోవడానికి పర్యాటకులు రైలు,  బస్సులో వెళతారు.

Peru  Trajedy

ఒల్లంటాయ్‌టాంబో పట్టణాన్ని మచు పిచ్చుతో కలిపే సింగిల్ ట్రాక్‌పై భోజన సమయంలో  పెరూరైల్ వెళ్తుండగా ఇంకా రైల్‌కు  ఢీకొట్టిందని ఫెర్రోకారిల్ ట్రాన్సాండినో రైల్వే ఏజెన్సీ తెలిపింది.  ప్రమాదానికి అసలు కారణం ఇంకా తెలియలేదు. చు పిచ్చును 15వ శతాబ్దంలో ఇంకా పాలకుడు పచాకుటెక్ ఆదేశాల మేరకు 2,500 మీటర్ల (సుమారు 8,200 అడుగులు) ఎత్తులో నిర్మించారు. ఇది అద్భుత వాస్తుశిల్పంగా   పర్యాటకులు భావిస్తారు.

ALSO READ : MEXICO | రైలు ప్ర‌మాదం.. 13 మంది దుర్మ‌ర‌ణం

Leave a Reply