Temple | వైభవంగా మాస కల్యాణోత్సవం

Temple | వైభవంగా మాస కల్యాణోత్సవం

Temple | మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని శ్రీ ప్రాచీన శివరామ ఆలయము(Shivaram Temple)లో మాస శివరాత్రి సందర్భంగా శివ పార్వతుల మాస కళ్యాణోత్సవం(Kalyanotsavam) ప్రధాన అర్చకులు కొండోజు నవీన్ కుమార్(Kondoju Naveen Kumar) శిష్య బృందం ఈరోజు వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ మాజీ కో ఆప్షన్ సభ్యులు పాలకూరి నరసింహ గౌడ్ రమాదేవి దంపతులు కుటుంబసభ్యులతో కలిసి పాల్గొని పూజలు నిర్వహించారు.కార్తిక మాసం సందర్భంగా శివశక్తి పీఠం(Shivashakti Peetha) ఆధ్వర్యములో కార్తీకమాస వనబోజనాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో అయ్యప్ప,హనుమాన్, శివ స్వాములు, యడవల్లి సురేష్ కుమార్, శ్రీ రామోజు వెంకటేశ్వర్లు, తంగెళ్ల బిక్షం, పెరుమాల్ల ప్రమోద్ కుమార్, బక్కతట్ల స్వామి, అర్చకులు శ్రీ రామోజు మహేష్, బొల్లోజు శ్రీకాంత్, ముషం ప్రణీత్, స్వాములు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply