TEMPLE | వకుళమాత అమ్మవారి దర్శనం..

TEMPLE | వకుళమాత అమ్మవారి దర్శనం..


TEMPLE | తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : తిరుపతి రూరల్ మండలం పేరూరు బండ పై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy) మాతృమూర్తి శ్రీ వకుళమాత అమ్మవారి ఆలయాన్ని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి దర్శించారు. వకుళమాత ఆలయ విశిష్టతని మంత్రి అనగాని సత్యప్రసాద్ కి తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి వివరించారు. దర్శనానంతరం మంత్రి సత్యప్రసాద్, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు అందచేశారు.

Leave a Reply