నూతన పోచమ్మ ఆలయంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ప్రత్యేక పూజలు
గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఖానాపూర్ ఎమ్మెల్యే
కడెం, ఆంధ్రప్రభ: కడెం మండలంలోని సారంగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు బుధవారం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన గ్రామస్తులను అభినందించిన ఆయన, దేవాలయాలు గ్రామాల్లో ఐక్యత, సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, ఏఎంసీ చైర్మన్ భూషణ్, ఖానాపూర్ ఏఎంసీ డైరెక్టర్ ఎల్. నారాయణ, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మల్లేశ్ యాదవ్, సారంగాపూర్ సర్పంచ్ కోలా తేజస్విని శ్రీనివాస్, ఉపసర్పంచ్ కుమ్మరి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమ్మరి సుధాకర్, మార్కపు లక్ష్మణ్, ఆకుల లచ్చన్న, సలీమ్, రాజేశ్వర్, చిన్న నర్సయ్య, ఆనంద్, గ్రామ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
